జులై రెండున సడక్ బంద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఎస్సిల ఏబిసిడి వర్గీకరణ సాదన కోసం జూలై 2వ తేదిన జరిగే రాష్ట్ర వ్యాప్త సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జల బిక్షపతి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తూప్రాన్ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద వాల్పోస్టర్ ఆవిష్కరించారు.ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సడక్ బంద్ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగ, ఉపకులాలకు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పిన బిజెపి ప్రభుత్వం పై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జూలై 2న జరిగే సడక్ బంద్ మరియు జూలై 3న జరిగే చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జెల బిక్షపతి మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి చెట్ల పల్లి యాదగిరి మాదిగ, జిల్లా కార్యదర్శి సర్గల పర్శరాములు మాదిగ, ఎన్నెల్లి సుధాకర్ మాదిగ, యాదగిరి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.