బాపట్ల : ప్రముఖ పర్యాటక కేంద్రం, గుంటూరు జిల్లా సూర్యలంకలో జూన్ 22,23వ తేదీలలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ఈ ఉత్సవాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణలను అహ్వానించినట్లు ఆమె తెలిపారు. బాపట్ల పట్టణానికి ఆ పేరు వచ్చి 500 ఏళ్లు దాటిన సందర్భంగా పంచమశతాబ్ది ఉత్సవాల నిర్వహణపై పుర ప్రముఖలతో చర్చించి త్వరలో వివరాలను ప్రకటిస్తామన్నారు.




