టిఫిన్‌సెంటర్‌లోకి దూసుకెళ్లిన బస్సు
ఇద్దరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్,మే16(జనం సాక్షి): సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ఆర్‌టిసి బస్సు మంగళవారం రాత్రి బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి పక్కనే ఉన్న ఉన్న టిఫిన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టిఫిన్ మాస్టర్‌తో పాటు భోజనం చేస్తున్న నిమామాబాద్‌కు చెందిన మరో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పికెట్ డిపోకు చెందిన బస్సు నల్గొండ నుంచి జెబిఎస్‌కు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సును స్టేషన్‌లో నిలిపేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్న సమయంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ నడపడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మారేడు పల్లి పోలీసులు డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
జూబ్లీలో బస్సు బీభత్సం




