– 2.5టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్న కుమారస్వామి
– కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, మే3(జనంసాక్షి) : మహబూబ్‌నగర్ ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి కర్ణాటక సీఎం కుమారస్వామి స్పందించారు. జూరాలకు 2.5టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో శుక్రవారం సాయంత్రం జూరాలకు నీరు విడుదల కానుంది. ఏప్రిల్ 30న కర్ణాటక సీఎం కుమారస్వామిని సీఎం కేసీఆర్ కోరారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎస్ టీఎం విజయ్ భాస్కర్‌కు సీఎస్ ఎస్‌కే జోషి కూడా లేఖ రాశారు. సీఎం కేసీఆర్ అభ్యర్థన మేరకు జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం కుమారస్వామి స్వయంగా ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్‌కు తెలిపారు. అందుకు ప్రతిగా కర్ణాటక సీఎం కుమారస్వామికి తెలంగాణ ప్రజల పక్షాన, మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇలాగే సుహృద్భావ, స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ ఉభయ రాష్టాల్రు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ సాయంత్రం జూరాల ప్రాజెక్టుకు నారాయణ్‌పూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కార్యక్రమం ప్రారంభం కానుంది.
జూరాలకు నీటివిడుదలకు.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం




