జూలై 3న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీజీ సభ’ ను విజయవంతం చేయాలి ; మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా
ఎల్బీ నగర్ ( జనం సాక్షి ) జూలై 3న మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నందు బిజెపి తెలంగాణ శాఖ నిర్వహిస్తున్న ”విజయ సంకల్ప సభ”లో పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎల్బీనగర్ నియోజకవర్గం బిజెపి సినియర్ నాయకులు మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా పిలుపునిచ్చారు .
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోడీజీ మీటింగ్ పర్యవేక్షణ లో మా గురువు గరికేపాటి మోహన్ రావు ,మాజీ రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో..కలిసి మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా పాల్గొన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , బిజెపి జాతీయ అధ్యక్షులు జె. పి. నడ్డా పాల్గొని, బిజెపి శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు సందేశమివ్వనున్నారని ఈ భారీ సభకు భారీస్థాయిలో తరలి వచ్చి విజయవంతం చేయాలని మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా విజ్ఞప్తి చేశారు .