Tuesday, 3 November 2026

జేపీ నడ్డాతో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరిస్తున్నారు. ఈమేరకు ఆయన జేపీ నడ్డాను కలిశారు. కాగా, ఉదయం నుంచి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి రాష్ట్రంలోని పరిశ్రమల స్థాపనకు సంబంధించి పర్యావరణ అనుమతులపై చర్చించారు. మరో కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్‌తో బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి, సీఈసీ హచ్.ఎస్. బ్రహ్మను కలిసి నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చించిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *