జేసీ దివాకర్‌రెడ్డిని ప్రజలే తరిమికొడతారు
– ఎన్నికల హావిూలను మహానాడులో ఎందుకు ప్రస్తావించలేదు
– వైసీపీ నేత ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
కడప, మే30(జనం సాక్షి) : టీడీపీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్‌సీపీ నేత, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబాన్ని విమర్శించడమే ధ్యేయంగా మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోకర్ లాంటి దివాకర్ రెడ్డితో మాట్లాడించారని విమర్శించారు. వైఎస్సార్ బిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ ఇప్పుడు ఆ మహానేత కుటుంబాన్నే విమర్శిస్తుంటే ప్రజలు సహించరని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆకేపాటి హెచ్చరించారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లో పనిచేసిన దివాకర్‌రెడ్డి అప్పుడు వైఎస్ చేసిన తప్పులు కనిపించలేదా అని ప్రశ్నించారు.. కేవలం కావాలనే వైఎస్‌ను అప్రదిష్టపాలు చేస్తూ సొంత లబ్ధికోసం చంద్రబాబును పొడుతున్నాడని, ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదన్నారు. అనంతపురం జిల్లాలో తెదేపా పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంనం కాయమన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నిర్వహించిన మహానాడు ఒక పెద్ద మాయలాంటిదని విమర్శించారు. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హావిూలను మహానాడులో ఎందుకు ప్రస్తావించ లేదని ఆయన టీడీపీ నేతలను ప్రశ్నించారు. జేసీ దివాకర్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీలు మూకుమ్మడిగా ఆంధప్రదేశ్ ప్రజలను మోసం చేశాయని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.