Wednesday, 4 November 2026

జోగి రమేశ్‌పై పోలీస్‌ కేసు

 

గుంటూరు,నవంబర్‌3(జ‌నంసాక్షి): వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్‌కు గుంటూరు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ జగన్‌ విూద హత్యాయత్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తే చేశారంటూ జోగి రమేష్‌ ఆరోపణలు చేశారు. దీనిపై

గుంటూరు ఆరండాల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ జోగి రమేష్‌ ఇంటికి గుంటూరు పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని, ఆధారాలు చూపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు విచారణను తప్పు దోవ పట్టించటానికే పోలీసులు నోటీసులు జారీ చేశారని జోగి రమేష్‌ ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు విచారణ సరిగా చేయకుండా బెదిరింపులకు దిగుతోంది అనటానికి ఈ నోటీసులే నిదర్శనం అన్నారు.