జోరు వర్షాలతో పొంగుతున్న వాగులువంకలు

ఏలూరు,జూలై19(జ‌నం సాక్షి): వరుసగా కురుస్తున్న వర్షాలకు మెట్ట ప్రాంతంలోని కాలువలు, వాగులకు జలకళ వచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ కొండప్రాంతాల నుండి ప్రవహించే జల్లేరు, బైనేరు వాగులు ఓ మోస్తారుగా ప్రవహిస్తున్నాయి. దీంతో జల్లేరువాగు, ఇతర కాలువల నుండి యర్రకాలువ జలాశయానికి కొత్తనీరు చేరింది. దీంతో పంటకాలువలపై ఆధారపడిన వరి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసే సమయంలో వర్షాలు కురవడం లాభదాయకమేనని పేర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొత్తనీరు జలాశయంలోకి చేరినట్లు ఇరిగేషన్‌శాఖ అధికారులు తెలిపారు.

తాజావార్తలు