*జ‌ర్న‌లిస్టు న‌ర్సింలును ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే

వ‌ట్‌ప‌ల్లి,  జనం సాక్షి :
అందోల్ నియోజ‌క‌వ‌ర్గ జనం సాక్షి దిన పత్రిక ఇంచార్జి, జర్నలిస్ట్  న‌ర్సింలు ఇటీవ‌ల గుండె పోటుకు గురై  హైద‌రాబాద్ లోని మ‌హావీర్ ఆసుప‌త్రిలో   చికిత్స పొందుతున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఈ విష‌యం తెలుసుకున్న  అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్  బుథ‌వారం నాడు  మ‌హావీర్ ఆసుప‌త్రికి వెళ్లి న‌ర్సింలును ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్దితులపై  వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే న‌ర్సింలుకు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌ను కోరారు.   నర్సింలు కుటుంబానికి అండగా ఉంటామ‌ని ఎమ్మెల్యే చంటి  క్రాంతికిర‌ణ్‌, టీయుడ‌బ్ల్యుజె ప్రధాన కార్యదర్శి సాగ‌ర్‌లు తెలిపారు. అదే విధంగా   న‌ర్సింలుకు ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటామ‌ని  వారు భ‌రోసా క‌ల్పించారు.  ఈ సందర్భంగా నర్సింలు  త్వరగా కోలుకోవాలని
అందోల్ నియోజకవర్గంలోని మండలాల విలేకరులు  భగవంతున్ని కోరుకుంటున్నారు.