Monday, 2 November 2026

ఝార్ఖండ్‌ సీఎంగా రఘువీర్‌ ప్రమాణం

6

రాంచీ, డిసెంబర్‌ 28(జనంసాక్షి) : జార్ఖండ్‌ సీఎంగా రఘువర్‌ దాస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని బిర్సాముండా ఫుట్‌బాల్‌ స్టేడియంలో ఆదివారం

రఘువర్‌ దాస్‌ చేత రాష్ట్ర  గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రానికి చెందిన నేతలు, భారీగా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది.

కానీ ఢిల్లీలో దట్టమైన మంచు ఆవరించి ఉంది. దాంతో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణం రద్దు అయింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల అయిదు దశలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. దాంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అత్యధిక గిరిజనులు గల జార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎంగా రఘువర్‌ దాస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌, మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌, భాజపా శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ దిల్లీలో దట్టమైన పొగమంచు అలముకోవడంతో వాతావరణం అనుకూలించక ప్రధాని రాలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *