సిద్దిపేట డిసెంబర్ 28(జనంసాక్షి): మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.. మైనార్టీల అభివృద్ధి కోసం షాదీముబారక్‌తో పాటు ఎన్నోసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి చేయూతనందిస్తుంది. మైనార్టీ వర్గాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే దిశగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది. మైనార్టీల వర్గానికి చెందిన ముస్లిం, క్రిస్టియన్, జైనులు, భౌద్ధిస్టులు, ఫార్శీలులలోని నిరుపేదలకు అండగా ఉంటామంటూ ప్రభుత్వం షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుపేదలైన మైనార్టీ వర్గాల్లోని యువతుల వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం 51వేల రూపాయలు చేయూతనిస్తూ వారి వివాహాలు జరుపుతూ వారికి అండగా నిలుస్తుంది.
ఇంతే కాకుండా మైనార్టీలలోని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో నిరుద్యోగ యువతకు చేదోడు, వాదోడుగా చేయూతనిస్తూ వారి సొంత కాళ్ల వారు నిలవాలని ధృడసంకల్పంతో ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేసి జీరో శాతం వడ్డీపై రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే సిద్దిపేటలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది.
ఈ బ్యాంకు ద్వారా నిరుపేద, నిరుద్యోగ యువతకు జీరో శాతం వడ్డీతో రుణాలిచ్చి వారికి ఉపాధి కల్పనకు కృషి చేస్తుంది. దీంతో మైనార్టీ వర్గానికి చెందిన చిన్నచిన్న వ్యాపారులతో పాటు నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది. బ్యాంకు కోసం సిద్దిపేటలో ప్రత్యేకంగా భవనాన్ని సైతం నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ షాదీముబారక్, ఇస్లామిక్ బ్యాంకును మైనార్టీలు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందవచ్చు.





