Wednesday, 4 November 2026

టాటా అధ్యక్షునిగా విక్రమ్‌ రెడ్డి

హైదరాబాద్‌,జనవరి22(జ‌నంసాక్షి): అమెరికాలో తెలంగాణ ప్రజల కోసం ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంఘం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా)కు అధ్యక్షునిగా విక్రమ్‌ రెడ్డి జనగామ నియమితులయ్యారు. అలాగే కోర్‌ కమిటీలో సభ్యులుగా కొత్తవారు ఎన్నికయ్యారు. అమెరికాలో ఉన్న తెలంగాణ వాసుల కలలను సాకారం చేసేలా ఈ అసోసియేషన్‌ పనిచేస్తోంది. తెలంగాణ భాష, సంస్కృతిని ప్రతిబింబించే వివిధ కళల ప్రోత్సాహానికి సహకారాన్ని, అమెరికా నలుమూలలా తెలంగాణ సంస్కృతి విస్తరణకు, పరిరక్షణకు సంఘం కృషి చేస్తున్నది. లాస్‌వెగాస్‌లోని ఆరియా కన్వెన్షన్‌ సెంటర్‌లో డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు విూటింగ్‌లో సుమారు 150 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అసోసియేషన్‌ సభ్యులు ఎన్నుకున్నారు. టాటా ప్రెసిడెంట్‌గా విక్రమ్‌ జనగామను అడ్వైజరీ కౌన్సిల్‌ ఎంపిక చేసింది. తనకు మద్దతుగా నిలిచిన సభ్యులందరికీ విక్రమ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా వంశీ రెడ్డి, జనరల్‌ సెక్రటరీగా శ్రీనివాస్‌ గానగోని, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మహేశ్‌ ఆదిభట్ల, ట్రెజరర్‌గా రంజీత్‌ క్యాటం, జాయింట్‌ సెక్రటరీ నీలోహిత కొత్త, జాయింట్‌ ట్రెజరర్‌గా సురేశ్‌ వెంకన్నగారి, ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హరీందర్‌ తాళ్లపళ్లి, ఎగ్జిక్యూటివ్‌ కో-ఆర్డినేటర్‌గా శ్రీనివాస్‌ మనప్రగాడలు ఎన్నికయ్యారు.