టాటా ఉద్యోగుల సంఖ్య 6,11,794గా

j3rtjm4wదేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటాగ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6 లక్షల మైలురాయిని దాటింది. ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్ వరకు అన్నీ తయారు చేసే టాటా గ్రూపు సంస్థల్లో మార్చి 2015 చివరినాటికల్లా పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 6,11,794గా నమోదైంది. అందులో ఐటీ, కమ్యూనికేషన్ విభాగ వ్యాపారాల్లో పనిచేస్తువారి సంఖ్య 3.5 లక్షలకు పైమాటే. ఇంజినీరింగ్ విభాగ సంస్థల్లో 93వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వందకు పైగా సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టాటాగ్రూపు ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 10, 878 కోట్ల డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 10,327 కోట్ల డాలర్లుగా నమోదైన రెవెన్యూతో పోలిస్తే 5.3 శాతం వృద్ధి చెందింది. టాటా గ్రూపు ఆదాయంలో అంతర్జాతీయ వ్యాపారాల ద్వారా వచ్చే వాటానే 70 శాతం మేర ఉంటుంది. గతసారి ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూ 5.8 శాతం పెరిగి 7,341 కోట్ల డాలర్లకు చేరుకుంది.