స్టాక్ సూచీలకు దిశానిర్దేశం

28qpn9h7దేశీయంగా స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ట్రెండ్ ఈవారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వీటితోపాటు రుతు పవనాల పురోగతి, రూపాయి మారకం రేటు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, వాహన విక్రయ గణాంకాలు కూడా ట్రేడింగ్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. గత కొన్ని వారాలుగా మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. మున్ముందు కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చని ఈక్విటీ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ పరిణామాల విషయానికొస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) వృద్ధిరేటు గణాంకాలు సోమవారం విడుదల కానున్నాయి. మంగళవారం (సెప్టెంబర్ 1) నాడు ఆటోమొబైల్ కంపెనీలు ఆగస్టు నెల విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. కీలక సంస్కరణల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఏమేరకు చొరవ తీసుకుంటుందన్న అంశాన్నీ ట్రేడింగ్ వర్గాలు నిశితంగా గమనించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. చైనాలో పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంశంపై మదుపర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.