యానాం : దర్యాలతిప్ప రహదారి మార్గంలో బుధవారం టాటా ఏసీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న 14 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరంతా జీఎస్‌పీసీ పరిశ్రమలో పనికచేసేందుకు ట్రక్కులో వెళ్తున్నారు. కార్మికులంతా జార్ఖండ్ వాసులు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.




