Wednesday, 4 November 2026

టింబర్‌ డిపోలో భారీ అగ్ని ప్రమాదం: రూ.కోటిన్నర నష్టం

గుంటూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): నరసరావుపేట మరవకుంటలోని ఓ టింబర్‌ డిపోలో తెల్లవారు జామున విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టింబర్‌ డిపోలోని కలపకు మంటలు అంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరిపేట, గుంటూరుకు చెందిన అగ్నిమాపక యంత్రాలు మంటలార్పాయి. ప్రమాదంలో రూ.కోటిన్నరకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. ఘటనా స్థలాన్ని సభాపతి కోడెల శివప్రసాదరావు సందర్శించారు. ప్రమాద వివరాలపై ఆరాతీసారు.