కర్నూలు,అక్టోబర్30(జనంసాక్షి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి పనులపై ఓర్వలేని ప్రతిపక్షాలు దుష్పచ్రారం చేయడం సరికాదని టిడిపి మాజీ ఎమ్మెల్యే విూనాక్షినాయుడు అన్నారు. కేంద్ర సహకారం లేకుండా ఎపిని అన్నిరంగాల్లో ముందుకు తసీఉకుని వెళుతున్న ఘనుడు బాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని పండిట్ నెహ్రూ రహదారిలో అన్న ఎన్టీఆర్ క్యాంటీన్‌ను ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర సహాయం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అనంతరం ప్రజలకు అన్నం వడ్డించారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ రామలింగేశ్వర్, ఆదోని మండల ఎంపీపీ పద్మావతి, డీఈ రామ్మూర్తి, మార్కెట్ యార్డు ఛైర్మన్ దేవేంద్రప్ప, వైస్ ఛైర్మన్ ఫక్రుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.




