రైలులో ఆన్‌లైన్ ఆహారం..
లోక్‌సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడి
లోక్‌సభలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడి
![]() |
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రయాణికులు ఆన్‌లైన్‌లో బెడ్‌రోల్స్‌ను బుక్ చేసుకునే వెసుబాటు కల్పిస్తున్నామని, టికెట్ లేకపోయినా మొబైల్ ఎస్‌ఎంఎస్ చూపించి ప్రయాణించవచ్చని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. గురువారం లోక్‌సభలో 2015-16 రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన విషయాన్ని వెల్లడించారు. రైల్వే ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 182ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అంతేకాకుండా రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పారు. రైల్వేల్లో తక్కువ ధరకే తాగునీటి సరఫరా కల్పిస్తామన్నారు.





