Wednesday, 4 November 2026

మూడు నెలల శిశువు గొంతుకోసిన తల్లి

ఖమ్మం: జిల్లాలోని అశ్వారావుపేట మండలం గాడ్లగూడెంలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసిన కన్నతల్లే మూడు నెలల శిశువు గొంతుకోసి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుర్తించిన చుట్టుపక్కలవారు తల్లీపిల్లను ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. భర్తతో గొడవలే భార్య ఆత్మహత్యాయత్నానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *