Thursday, 5 November 2026

టిడిపితో పొత్తుతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌ సీనియర్లు పార్టీని వీడే ప్రమాదం

అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ప్రత్యేక¬దా హావిూ ప్రకటన ప్రజల్లో స్పందన వచ్చినా టిడిపితో పొత్తు కారణంగా పాతకాపులు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి వెనకాడుతున్నారు. అలాగే కాంగ్రెస్‌ను వీడి కొందరు ఇతర పార్టీలు చూసుకుంటున్నారు. కాంగ్రెస్‌పై టిడిపి పెత్తనం ఉంటుందన్న భయం వారిని పట్టుకుంది. పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లి అక్కడ ఇమడలేని వారు తిరిగి వస్తారని విశ్లేషించారు. ఇతర

పార్టీలకు వెళ్లిన వారిని కలిసి.. వెనక్కి రావాలంటూ గతంలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ ఉమెన్‌ చాందీ పిలవాలని సూచించారు. ఈ కోవలోనే ఆంధ్రాలో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అయితే ఇప్పుడు టిడిపితో బందం కారణంగా చాలామంది వెనకడుగు వేస్తున్నారు. తాజాగా పార్టీలో ఉన్న మాజీమంత్రి రామచంద్రయ్య వైకాపాలో చేరారు. ఆయన ఒకప్పుఉడ బాబుకు సన్నిహితంగా ఉన్నా చిరంజఈవి ప్రజార్యాంతో పార్టీ మారారు.ఇప్పుడు మళ్లీ వైకాపాలో చేరారు. పార్టీలో ఒకప్పుడు

కీలకంగా వ్యవహరించిన నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులపైనా కాంగ్రెస్‌ దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్‌ఇనకల నాటికి ఇది వర్కవుట్‌ కాలగదని భావిస్తున్నారు. పార్టీకి దూరమైన ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జీవీ హర్షకుమార్‌లపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. రాజీవ్‌గాంధీతో మరింత అనుబంధం ఉండేది. రాజీవ్‌ పర్యటనకు వస్తే అనువాదకుడిగా పనిచేసేవారు. ఏఐసీసీ అధ్యక్షురాలి ¬దాలో సోనియా కూడా ఉండవల్లిని సలహాలు అడిగేవారు. కాంగ్రెస్‌ పార్టీకి అంతటి కీలకమైన నేత కావడంతో ఉండవల్లిని తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలంటూ ఆహ్వానం పంపారు. రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి కాంగ్రెస్‌ను సైతం తూర్పారబట్టారు. ఆ పార్టీకి రాజీనామా చేసి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరినా, ఎన్నికలలో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరతారని ఉండవల్లి అనుచరవర్గం భావించింది. అయితే ఇప్పటికీ అరుణ్‌కుమార్‌ జగన్‌ పార్టీలో చేరలేదు. అమలాపురం నుంచిరెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన జీవీ హర్షకుమార్‌ కాంగ్రెస్‌లో కీలక నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. హర్షకుమార్‌ కూడా రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్రలో చేరి.. లోక్‌సభకు పోటీచేసి ఘోర పరాజయం పొందారు. సమైక్యాంధ్ర పార్టీలో కొన్నాళ్లు ఉండవల్లితో కలిసి క్రియాశీలకపాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ నుంచి పిలుపురావడంతో హర్షకుమార్‌ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హర్షకుమార్‌ కాంగ్రెస్‌ పునరాగమనం చేస్తారా? అన్నది చూడాలి. తునికి చెందిన రాజా అశోక్‌బాబు, పిఠాపురం నుంచి కొప్పన మోహనరావు, కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ.. ఇలా ప్రాంతాల వారీగా కాంగ్రెస్‌ మాజీలపై దృష్టిసారించారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు పాత నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే బాధ్యత తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రభావం లేకపోయినా కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి

రాగలదన్న నమ్మకంలో నేతలు ఉన్నారు. అందుకే ఉమెన్‌ చాందీ పిలుపుతో నేతలు మళ్లీ సానుకూల దృక్పథంతో ఉన్నట్లు సమాచారం.