పావులు కదుపుతున్న బాబు
అమరావతి,నవంబర్14(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రత్యేక¬దా అంశమే ఆయుధమని భావించి పావులు కదిపిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్చార్జి, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ప్రయత్నాలు టిడిపికి అనుకూలంగా మారాయి. ఇప్పుడు రాహుల్ గాందీ కూడా నేరుగా ప్రత్యేక¬దాకు కట్టుబడి ఉన్నామని చెప్పడంతో టిడిపి ఆ పార్టీతో జట్టుకట్టడం జరిగింది. ఇది రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారనుందని ప్రచారం చేసుకుంటున్నారు. టిడిపి,కాంగ్రెస్ జతకట్టడాన్ని ఇప్పుడు జనసేన, బిజెపి, వైకాపాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్‌తో టిడిపి జతకట్టిందని ప్రచారం చేస్తున్నాయి. దీనిని అవకాశవాద రాజకీయంగా చూస్తున్నాయి. అయితే ప్రత్యేక¬దా అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో బిజెపి, మోడీపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే విభజనలో బిజెపి పాత్రా ఉంది. ఈ దశలో కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికరాంలోకి వస్తుందన్న భరోసా కలుగుతోంది. అందుకే రాష్ట్రంలో అధికరాంలోకి వచ్చినా రాకున్నా కేంద్రంలో అవకాశాలు ఉంటాయన్న భరోసాలో నేతలు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీకి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించేలా ఉమెన్ చాందీ దూసుకుని పోతున్నారు. తక్షణమే రంగంలోకి దిగిన ఆయన ఇప్పటికే పార్టీ నేతలు, ముఖ్యులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల బాధ్యులతో పలుపర్యాయాలు మాట్లాడారు. ప్రత్యేక ¬దా అంశమే కాంగ్రెస్‌కు సరైన ఆయుధమని చెప్పారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదన్న అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. టిడిపితో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా లేదా అన్నది తెలియదు. అయితే రాహుల్ ప్రత్యేక¬దా హావిూతో మళ్లీ పూర్వవైభవం సాధించుకోవాలని టిడిపి యోచిస్తోంది. గతంలో తెలుగుదేశం మైత్రి కారణంగా కొన్ని సీట్లు సాధించినా మళ్లీ అలాంటి అవకాశం లేదని, ప్రత్యేక¬దా హావిూని బిజెపి విస్మరించింది కనుక ప్రజలు ఓటేయరన్న ధీమాలో ఉన్నారు. వైసీపీ నుంచి ఎంపీలు గెలిచినా ఏవిూ సాధించలేరన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెబితే రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేందుకు, తద్వారా ఎపికి ప్రత్యేక ¬దా సాధించేందుకు
అవకాశాలు ఉన్నాయన్న ప్రచారంతో కాం/-గరెస్ నేతలు కూడా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేకపోయినా కర్ణాటకలాంటి పరిస్థితులు ఏర్పడితే మనం కీలక
పాత్ర పోషించే అవకాశం ఉంటుందన్న భావనలో ఉమెన్ చాందీ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రత్యేక ¬దా కోరుకుంటున్నందున కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ చేసే మొదటి సంతకం దీనిపైనేనని చెబుతూ ప్రజల్లోకి వెళితే మంచి ఫలితం ఉంటుందన్నారు.




