టిడిపి కార్యకర్తల ఆందోళన

అనంతపురం,నవంబర్‌30(జ‌నంసాక్షి): అనంత జిల్లాలోని బుక్కరాయసముద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. మాజీ జడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ వారు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆయనను పార్టీలో చేర్చుకుంటే పార్టీకి నష్టమని, ఈ విషయాన్ని అదిష్టానం గుర్తించాలంటూ పలువురు కార్యకర్తలు పేర్కొన్నారు. దీనిపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖలు రాస్తామన్నారు.

తాజావార్తలు