ఏనుగుల సంచారంతో ఆందోళన

శ్రీకాకుళం,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఏనుగుల మంద మరోమారు ప్రజలను భయపెట్టింది. జిల్లాలోని మెలియాపుట్టి సవిూపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెలియాపుట్టి పోలీస్‌స్టేషన్‌కు అతి సవిూపంలో గురువారం ఉదయం ఏనుగుల గుంపు సంచరించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. పక్కనే ఉన్న అడవుల నుంచి బయటకు వచ్చిన ఏనుగులు గ్రామానికి అతి సవిూపంలోకి వచ్చాయి. దీంతో పిల్లా, పాపలను తీసుకుని పరుగులు పెట్టారు. గతంలో ఇవి దాడి చేసిన అనుభం ఉండడంతో అటవీ అధికారులు చర్య తీసుకోవాలని కోరారు.

తాజావార్తలు