టిడిపి పాలన అంతానికి పోరాటం: డిసిసి
అనంతపురం,నవంబర్17(జనంసాక్షి): రాష్ట్రంలో దుర్మార్గ పార్టీలను సాగనంపి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యానారాయణ అన్నారు. ఎపిలాంటి అధ్వాన, నిరంకుశ, వంచన పాలన ప్రపంచంలో ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. ఇసుకలో దోపిడీ, మట్టిలో దోపిడీ, ఎమ్మెల్యేలను కొనడం, బియ్యం పంపిణీలోనూ దోపిడీనే జరుగుతున్నాయని అన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ముగిసిపోయిన అధ్యాయం కాదని, దాన్ని సాధించే వరకు పోరాటం ఆగదని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్షం లేకుండా శాసనసభ సమావేశాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం ప్రత్యేక ¬దా ఇవ్వకపోగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు. ¬దా రాకపోవడం వల్లే రైల్వే జోన్, విశాఖ చెన్నై కారిడార్ రాలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చంద్రబాబు వల్ల సాధ్యం కాదన్నారు.