Wednesday, 4 November 2026

19న నాణెళిల ప్రదర్శన

ఏలూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఈనెల 19, 20 తేదీల్లో రెండురోజుల పాటు స్టాంపులు, నాణెళిల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. స్థానిక లయన్స్‌ సామాజిక భవనంలో ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ప్రదర్శనలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రదర్శనకారులు పాల్గొంటారన్నారు. యూత్‌ హాస్టల్స్‌ పాలకొల్లు శాఖ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రదర్శనలో వివిధ పోటీలు జరుపుతున్నట్లు తెలిపారు. 19న ఉదయం 10 గంటలకు పట్టణస్థాయిలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రపంచ శాంతి, స్టాంపులు, నాణెళిల్లో ఏదోఒక అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు. 20న సాయంత్రం 5 గంటలకు ముగింపు సభ జరుగుతుందన్నారు. ఈ ప్రదర్శనను పట్టణవాసులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు తిలకించాలని కోరారు. యూత్‌ హాస్టల్స్‌ సంఘ పాలకొల్లు శాఖ, లయన్స్‌ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంస్థల ప్రతినిధులు వివరాలు తెలిపారు.