టీఆరెఎస్ ప్రభుత్వం తోనే పల్లెల అభివృద్ది.

నార్నూర్.. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ప్రతి పల్లెలో గ్రామాభివృద్ధి జరుగుతుందని గాదిగూడ వైస్ ఎంపిపి మర్శవానే యోగేష్ కొనియాడారు.శనివారం మండలంలోని కొత్తపెల్లి ఎస్ సి గూడ లో 2.5 లక్షల నిధులతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వ చేపట్టని విధంగా టీఆరెఎస్ రాష్ట్ర ప్రభుత్వం మరియు జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్,ఎమ్మేల్యే ఆత్రం సక్కుల సహకారంతో గ్రామాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ మురహరి గ్రామస్తులు ఉన్నారు.