– మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పాడు
– నా అల్లుడికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు
– కిరాయికి వచ్చినవాళ్లు ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు
– సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్9 (జనం సాక్షి ) : తెరాస పార్టీకి తానూ ఓనర్‌నేనంటూ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో విూడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఏ కార్పొరేషన్ పదవి అక్కర్లేదన్నారు. నాయినీ నర్సింహా రెడ్డికి కార్పొరేషన్ ఛైర్మన్‌గా త్వరలో పదవి ఇవ్వబోతున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే ‘ముఠా గోపాల్ ను గెలిపించుకురా.. మంత్రిని చేస్తా అని కేసీఆర్ హావిూ ఇచ్చారని నాయినీ చెప్పారు. ఆ సమయంలో తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికైనా టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కానీ, అవేవిూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకు ఏ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వద్దని, రాష్ట్ర ¬ంశాఖ మంత్రిగా పనిచేసిన నాకు ఇప్పుడు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తానంటే.. అది ఎవరికి కావాలని నాయిని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో నేను కూడా ఓనర్‌నే అని.. కిరాయికి వచ్చినవాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదంటూ నాయినీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పార్టీ సీనియర్ నేత నాయినీకి ¬ం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు గులాబీ దళపతి. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయణ్ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కేబినెట్ విస్తరణలోనూ చోటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి పెరిగింది. ప్రస్తుతం నాయిని ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజయ్య..
అధికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తాజా కేబినెట్ కూర్పుపై మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో 11 నుంచి 12 శాతం మాదిగలున్నారని, కానీ కేబినెట్‌లో మాత్రం మాదిగలు లేరని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
విలేకరులతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ… తెలంగాణలో మాదిగలు, ఏపీలో మాలలున్నారని తెలిపారు. అయితే మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని రాజయ్య అన్నారు.
టీఆర్‌ఎస్‌కు నేనూ ఓనర్‌నే




