Wednesday, 4 November 2026

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

హైదరాబాద్: తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి. తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా .. సీఎం కేసీఆర్ ఆయ‌నకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను నియమించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన విష‌యం తెలిసిందే. గురువారం రాజ్‌భ‌వ‌న్‌లో కేసీఆర్ రెండ‌వ సారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండటంతో సీఎం కేసీఆర్‌పై పనిభారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా టీఆర్‌ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారు. దేశంలోనే అతిగొప్ప పార్టీగా టీఆర్‌ఎస్‌ను రూపొందించే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారు.

కేటీఆర్‌ నియామకంపై తెరాస శ్రేణుల సంబరాలు

 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు తు.చ తప్పకుండా అమలుచేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా.. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ నియామకం పట్ల తెరాస శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. తమ అభిమాన నేతకు అభినందనలు తెలిపేందుకు పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో కేటీఆర్‌ పడ్డ కష్టాన్ని కేసీఆర్‌ గుర్తించారని జగదీశ్‌రెడ్డి అన్నారు. పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్ కు అభినందలు తెలిపిన జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి

Jagadish reddy and Indrakaran reddy wishes to Minister KTR

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ కు మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ మరెన్నో విజయాలు నమోదు చేస్తోందని కాంక్షించారు.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాల్క సుమన్, అసదుద్దీన్ ఓవైసీ, మేయర్ బొంతు రామ్మోహన్ కేటీఆర్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తన్నీరు హరీశ్ రావు.. కేటీఆర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. థ్యాంక్స్ బావ అంటూ హరీశ్ కు కేటీఆర్ రీట్వీట్ చేశారు.