హైదరాబాద్,జనవరి17(జనంసాక్షి): గ్రూప్ సర్వీసులకు సంబంధించి సిలబస్‌లో పెద్ద మార్పులు ఉండబోవని టీఎస్‌పీఎస్సీ సభ్యుడు ప్రొఫెసర్ లింగమూర్తి తెలిపారు. హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో శనివారం సిలబస్ కమిటీ భేటీ అయ్యింది. గతంలో చర్చించిన విషయాలపై మరోమారు చర్చించారు. అనంతరం కమిటీ సభ్యుడు లింగమూర్తి విలేకరులతో మాట్లాడారు. పరీక్షల్లో మార్పులపై విద్యార్థుల నుంచి వినతులు అందాయని, ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర యువతకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఈనెల 30న ప్రభుత్వానికి తుది నివేదిక అందజేస్తామని సిలబస్ కమిటీ పేర్కొన్నారు. స్వల్ప మార్పులతో కొత్త సిలబస్ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు.
టీఎస్‌పీఎస్సీ సిలబస్‌లో స్వల్ప మార్పులే





