
దిల్లీ, జనవరి17(జనంసాక్షి): ఎన్ని సార్లు బుద్ధి చెప్పిన్పటికీ పాకిస్థాన్ తన తీరు మార్చుకోవడం లేదని కేంద్ర ¬ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటనకు ముందు దేశంలో దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా.. పాకిస్థాన్ తన తీరు మార్చుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అయినా ఇలాంటి వాటికి బెదిరే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. శాంతికి విఘాతం కలిగించే చర్యల్ని తిప్పికొట్టేందుకు ఎటువంటి అవకాశాన్ని వదులుకోబోమని రాజ్‌నాథ్ తెలిపారు. భారత్‌లో దాడులు చేసేందుకు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 200 మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని నిఘావర్గాలు తెలిపాయి. పాఠశాలలు, రద్దీ ప్రాంతాలు, మత సంబంధిత ప్రదేశాలు, సైనిక వాహన శ్రేణులపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. మరోవైపు పది ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ నిషేధించే యోచనలో ఉందన్న వార్తలపై రాజ్‌నాథ్ స్పందిస్తూ.. గతంలో పాకిస్థాన్ చాలా ఉగ్రవాద సంస్థలను నిషేధించింది. కానీ ఆ సంస్థలు వేరే రూపంలో, వేరే పేరుతో మళ్లీ పుట్టుకొచ్చాయని వ్యాఖ్యానించారు.
పాక్ వైఖరి మారటంలేదు – రాజ్‌నాథ్ సింగ్




