తెలంగాణ అసెంబ్లీ సమావే
శాలను 20 పనిదినాలపాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ కమిటీ హాల్‌లో నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమావేశాలకు సంబంధించి ఈ నెల 30 వరకు అజెండాను ఖరారు చేశారు. తొలిరోజు సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై చర్చించనున్నారు. జనవరిలో మరోసారి వారం పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు, విపక్ష నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్క, అక్బరుద్దీన్, కిషన్‌రెడ్డి, సున్నం రాజయ్య, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ అసెంబ్లీ 20 పనిదినాల ఖరారు




