తప్పుడు ప్రచారం చేస్తున్నారు
– ఉపాధ్యాయులు వాటిని నమ్మకండి
– తాకిడి ఎక్కువవడంతోనే సర్వర్ డౌన్
– కోర్టు తీర్పుకు అనుగుణంగా తదుపరి ప్రక్రియ
– అవసరమైతే ఐచ్ఛికాల నమోదు గడువు పొడిగిస్తాం
– తప్పుడు ధృవపత్రాలు ఇచ్చేవారిపై చర్యలు
– విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్, జూన్25(జనం సాక్షి ) : ఉపాధ్యాయుల బదిలీలు కోసం చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌పై
కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉపాధ్యాయులు తప్పుడు ప్రచారం నమ్మవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం విూడియాతో మాట్లాడారు. వేల మంది ఉపాధ్యాయుల తాకిడితోనే సర్వర్ డౌన్ అయిందని అన్నారు. ఉపాధ్యాయ బదిలీల కోసం వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా పక్రియ చేపట్టామని తెలిపారు. బదిలీల కోసం 75,318 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారని, ఖాళీలు, సీనియారిటీ జాబితాలు కూడా ప్రకటించామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకే షెడ్యూల్ సవరణ చేశామని స్పష్టం చేశారు. వివిధ అంశాల ఆధారంగా కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ నెల 26న వచ్చే న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా తదుపరి పక్రియ చేపడుతామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 2,193 మందిలో 2,181 మంది ప్రధానోపాధ్యాయులు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నారని కడియం తెలిపారు. 31,960 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ దరఖాస్తు చేసుకున్నారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. స్కూల్ అసిస్టెంట్ల ఐచ్ఛికాల నమోదుకు మంగళవారం వరకు అవకాశం ఉందన్నారు. ఎస్జీటీలకు కూడా ఒక రోజు అవకాశాన్ని పొడిగిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా తప్పులు దొర్లినట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే వెంటనే సరిదిద్దుతున్నామని తెలిపారు. వెబ్‌కౌన్సెలింగ్‌ను మొదట అంగీకరించిన ఉపాధ్యాయ సంఘాలు.. ఇప్పుడు వద్దంటున్నాయని గుర్తు చేశారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దంటూ తనకు సందేశాలు, ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ ఉండాలని కొంతమంది టీచర్లు చెబుతున్నారని పేర్కొన్నారు. సాంకేతిక ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రక్రియలో ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పకుండా సరిచేస్తామని కడియం తెలిపారు. తప్పుడు ధృవపత్రాలు ఇచ్చేవారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. తమ పెత్తనం పోతుందన్న ఉద్దేశంతోనే కొంతమంది తప్పుడు ప్రచారానికి తెరలేపారని కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇలాంటి వాటిని ఉపాధ్యాయులు పట్టించుకోవద్దని సూచించారు.
టీచర్ల వెబ్కౌన్సిలింగ్పై..




