టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం
– 28న గుంటూరులో బహిరంగ సభ
– మున్సిపల్ వైస్ చైర్మన్ రోషన్ అలీ
అనంతపురం, ఆగస్టు18(జనం సాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీల సంక్షేమం టిడిపితోనే సాధ్యమవుతుందని అనంతపురం మున్సిపల్ వైస్ చైర్మన్ రోషన్ ఆలీ, చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సార్ హమద్ పేర్కొన్నారు. శనివారం పట్టుగూళ్ల మార్కెట్ వద్ద బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికలను, కరపత్రాలను విడుదల చేశారు .అనంతరం పలు వార్డుల్లో మైనార్టీలకు కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు .పేద ముస్లిం యువతుల వివాహాల కోసం దుల్హన్ పథకం ద్వారా రూ 50 వేల రూపాయలను అందిస్తున్నామన్నారు. దులహన్ పథకం కోసం గత బడ్జెట్లో 100 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మసీదులో పనిచేసే ఇమాములు మౌజన్ ల కోసం రూ 5,000 3,000 గౌరవ వేతనం అందిస్తున్నామని .రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు .ఆయనకు అండగా నిలవాల్సిన బాధ్యత మైనార్టీలపై ఉందన్నారు .దీనికోసం ఈనెల 28న గుంటూరులో ముస్లిం బహిరంగసభ ఏర్పాటు
చేశామన్నారు. ఈ బహిరంగ సభకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.