టీడీపీ కుట్ర బెడిసికొట్టింది

– వైసీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ
– కాంగ్రెస్‌, టీడీపీ మైత్రి లోక్‌సభలో బయటపడింది
– ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌
అమరావతి, జులై21(జ‌నం సాక్షి) : విశ్వాస తీర్మానం పెట్టి ప్రధాని నరేంద్ర మోడీని నిందించాలనే తెలుగుదేశం పార్టీ కుట్ర బెడిసికొట్టిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ అన్నారు. అవిశ్వాసం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై తిరుపతిలో విూడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ అని విమర్శించారు. వారిపై ప్రజలలో వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురదజల్లాలని చూశారన్నారని అన్నారు. అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఆంధప్రదేశ్‌ పరువును తెలుగుదేశం పార్టీ బజారుకు ఈడ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీ మైత్రీ బంధానికి లోకసభ వేదికగా నిలిచిందని విమర్శించారు. త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందని జోస్యం చెప్పారు. ఎంపీ గల్లా జయదేవ్‌ అసత్యాలు సభలో ప్రస్తావించారని ఆరోపించిన ఆయన… ఆర్ధిక మంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని… ఇచ్చిన అన్ని హావిూలు అమలు చేస్తామని ఎమ్మెల్సీ మాధవ్‌ స్పష్టం చేశారు. తెలుగుజాతికి అవమానం కలిగేలా టీడీపీ ఎంపీలు సభలో వ్యవహరించారని, ప్రజల ఇచ్చిన అస్త్రలను వినియోగించుకోకుండా పనికిరాని పక్షంగా వైసీపీ మారిందని మండిపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల కోసం ఏపీలో బీజేపీ ఆపరేషన్‌ కొనసాగుతోందని మాధవ్‌ స్పష్టం చేశారు.

తాజావార్తలు