క్రికెటర్లను అభినందించిన ప్రముఖులు
హైదరాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి): ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు అజేయంగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడాన్ని అరుదైన విజయంగా అభివర్ణించారు. అన్ని రంగాల్లో రాణించిన టీమ్‌ఇండియా? ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఏడోసారి ఆసియాకప్‌ను ముద్దాడింది భారత్. చివరి బంతి వరకూ అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది. టోర్నీ ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు.. ఫైనల్‌లో కాస్త తడబడినా చివరకు ఆ ఒత్తిడిని జయించి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియాను పలువురు ప్రముఖులు అభినందించారు. అటు లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లాదేశ్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఆసియా కప్ విజేత టీమిండియాకు అభినందనలు. బంగ్లాదేశ్‌కు విజయం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. కానీ కీలక ఆటగాళ్లు లేకపోయినా బంగ్లా జట్టు ఎంతో ధైర్యంగా ఆడిందని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.
ఆసియాకప్ ఛాంపియన్స్‌కు అభినందనలు. కీలక సమయంలో ఉత్తమ ప్రదర్శన చేసిన కేదార్ జాదవ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. బంగ్లా కూడా చాలా బాగా ఆడింది. షకీబ్, తవిూమ్ లాంటి ఆటగాళ్లు
లేకపోయినా ఎక్కడా నమ్మకాన్ని కోల్పోకుండా విజయం కోసం పోరాడిందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. కంగ్రాట్స్ టీమిండియా. టోర్నీ మొత్తంలో బౌలర్లు ఎంతో మాయ చేశారు. ఈ గెలుపునకు ప్రధాన కారణం వారే. ్గ/నైల్ మ్యాచ్‌ను ఎంతో ఉత్కంఠభరితంగా మార్చిన బంగ్లాదేశ్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. వెల్‌డన్ అని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ఆసియా కప్ విజేత టీమిండియాకు అభినందనలు. కానీ బంగ్లాదేశ్‌ను తప్పకుండా అభినందించాలి. గొప్పగా పోరాడారు. నేడు క్రికెట్ గెలిచిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అన్నారు. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆసియాకప్‌ను కైవసం చేసుకున్న టీమిండియాకు అభినందనలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు.
టీమిండియాను అభినందించిన సిఎం కెసిఆర్




