ఆదిలాబాద్,ఫిబ్రవరి26(జనంసాక్షి): రోజువారీగా ప్రత్యేక తరగతులతో పూర్తిస్థాయిలో పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డిఇవో సత్యనారాయణరెడ్డి సూచించారు. టెన్త్ ఫలితాల్లో ఆదిలాబాద్ ముందుండేలా చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇప్పుడున్న తక్కువ సమయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. పరీక్షలకు ఇంకా 20 రోజుల సమయం ఉందన్నారు. ఈ సమయం చాలా కీలకమైందన్నారు. దీనిని వృధా చేయకుండా ఉదయం, సాయంత్రం విద్యాబోధన తరగతులను స్జబెక్టు ఉపాధ్యాయులతో నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎక్కడైనా స్జబెక్టులు బోధించే ఉపాధ్యాయులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఫలితాలు తగ్గితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ జగన్మోహన్ హెచ్చరించారు. ఉట్నూరు పీఎమ్మార్సీలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల హెచ్‌ఎంలు, గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సంక్షేమాధికారులతో పదో తరగతి ఫలితాలపై ఆయన సవిూక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి గైర్హాజరైన కొందరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా పాలనాధికారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడే ఏదో కారణాలు చూపుతూ కొందరు గైర్హాజరవుతున్నారని మండిపడ్డారు. ఎందుకు గైర్హాజరయ్యారో కారణాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రతి పాఠశాలలకు వైద్యబృందాలను పంపించి విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఇతరాత్ర మౌళిక సౌకర్యాల సమస్యలపై పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓను సూచించారు. కలెక్టర్ సూచనల మేరకు టీచర్లు, హెడ్మాస్టర్లు కృషి చేయాలని డిఇవో అన్నారు. సమయం లేదన్న సాకు చూపకుండా ఉన్న సమయంలోనే విద్యార్థులను సన్నద్దం చేయాలన్నారు.




