Tuesday, 3 November 2026

టేకులగూడెం వద్ద మావోయిస్టుల విధ్వంసం

Untitled-1వాజేడు: ఖమ్మం జిల్లా వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం వద్ద సోమవారం అర్ధరాత్రి మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్‌-ఛత్తీస్‌గఢ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఆరు వాహనాలను మావోయిస్టులు దహనం చేశారు. సాయుధులైన సుమారు 40 మంది మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోనిటేకులగూడెం వద్ద నిలిపి ఉంచిన మూడు టిప్పర్లు, జేసీబీ, రోలర్‌, ట్రాలీ లారీ వాహనాలను దహనం చేశారు. అక్కడే ఉన్న మరో రెండు ట్యాంకర్లను దహనం చేయాలని ప్రయత్నించగా.. వాహనాల పైన విద్యుత్‌ తీగలు ఉండడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *