ట్యాంకర్లతో మంచినీటి సరఫరా

జడ్పీ సమావేశంలో మంత్రి సోమిరెడ్డి
ఆనం వివేకాకు ఘనంగా నివాళి

నెల్లూరు,మే5(జ‌నం సాక్షి): ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తినా పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట ట్యాంకర్లతో యుద్ధప్రాతిపదికన తాగునీరు సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.  నెల్లూరులో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన  మాట్లాడారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే వివేకానందరెడ్డికి జిల్లా సాధారణ సమావేశంలో సంతాపం ప్రకటించారు. వివేకా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి పొలిటికల్‌ హీరో.. వ్యవహార శైలి, నెల్లూరు యాసలో ఆయన మాట్లాడే తీరు విలక్షణమైనది..చాలా మంచి మనస్సు కలిగిన వ్యక్తి..రాజకీయ ప్రత్యర్థి కూడా బాగుండాలని కోరుకునే ప్రత్యేక గుణం ఆయనదని..మా కుటుంబాల మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది.. వివేకానందరెడ్డి గారికి స్మారకంగా ఏదో ఒకటి చేయాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు..ఏమి చేయాలనే దానిపై వారి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నాం. అని పేర్కొన్నారు.

తాజావార్తలు