విశాఖపట్టణం,నవంబర్15(జనంసాక్షి): ఎస్.రాయవరం మండలం గోకులపాడు వద్ద గురువారం ఉదయం ట్రాక్టర్ బోల్తా పడింది. గోకులపాడు వద్ద ఉన్న ఓ నూతిలో ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడినవారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన ఇద్దరూ పి.అర్జున రావు (45), పి.సన్యాసిరావు (65) లుగా గుర్తించారు. గాయపడినవారి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.




