ట్రాన్స్ జెండర్లకు శుభవార్త… 

TG: రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ల ఆధార్ నమోదు, వివరాల్లో మార్పుల కోసం ఈ నెల 22 నుండి 24 వరకు రాష్ట్ర స్థాయి ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ తెలిపింది. ఈ ఆధార్ నమోదు కేంద్రం హైదరాబాద్ లోని మలక్ పేట్ దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుందని పేర్కొంది. పూర్తి వివరాలకు 040-24559048 నెం. సంప్రదించాలని సూచించింది