మైనర్లకు బైకులు ఇస్తే తల్లిదండ్రులదే బాధ్యత
ట్రాఫిక్ డిసిపి హెచ్చరిక
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపైనా, ప్రత్యేకించి మైనర్లకు బైకులు ఇచ్చే తల్లిదండ్రులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
మైనర్లకు వారి తల్లింద్రులు మోటార్ సైకిళ్లు ఇవ్వకూడదని, తల్లిదండ్రులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ అన్నారు. మేజర్లకు కూడా వాహనాలు గిప్ట్‌గా ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పాలని తెలిపారు. వాహనదారులు అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు తనిఖీలు చేస్తారని అన్నారు. నివాస ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 15 నుంచి 19 తేదీ వరకు నిర్వహించిన డ్రైవ్‌లో 164మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ వాహనాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి తల్లిదండ్రులకు ప్రతి శుక్రవారం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఐదు రోజులు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రైవ్‌లో అల్వాల్, బాలానగర్, గచ్చిబౌలి, జీడిమెట్ల, కూకట్‌పల్లి, మాదాపూర్, మియాపూర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు నడుపుతూ పలువురు మైనర్లు పట్టుబడ్డారు. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 75 కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలు వాహనాలు నడపడాన్ని ప్రోత్సహిస్తున్నారని, చిన్న చిన్న అవసరాలు పాలు, పేపర్, వాటర్, మెడిసిన్ తదితరాల కోసం వాహనాలు ఇచ్చి రోడ్లవిూదకు పంపిస్తున్నారని ఇది చాలా నేరమని డిసిపి విజయ్‌కుమార్ తెలిపారు. స్కూల్, కాలేజీలకు వెళ్లేందుకు వాహనాలు ఇస్తున్నారని అన్నారు. బంధువులను బస్‌స్టాప్‌ల్లో దించేందుకు కూడా వాహనాలు ఇస్తున్నారని అన్నారు. దీనిని ఆసరాగా తీసుకుని చాలా మంది పిల్లలు మోటార్ సైకిళ్లను తీసుకుని స్నేహితులతో కలిసి జాలీగా తిరుగుతున్నారని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు కనిపెడుతూ ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని కోరారు. పిల్లలకు విలువలు నేర్పి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తాం




