యువతిని తోసేయడంతో దుర్మరణం
కోయంబత్తూరు కాలేజీలో విషాద ఘటన
చెన్నై,జూలై13(జనం సాక్షి): కోయింబత్తూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన మాక్‌డ్రిల్.. ఓ విద్యార్థిని బలి తీసుకుంది. మాక్‌డ్రిల్ సందర్భంగా ఆమెను తోసేయడంతో కిందపడి తలకు బలంగా గాయంతో మరణించింది. ఈ విధంగారెండో అంతస్తు నుంచి పడి ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. అయితే ట్రైనర్ బలవంతంగా తోసేయండంతోనే ఈఘటన జరిగినట్లుగా సెల్‌ఫోన్‌లో రికార్డు కావడంతో ఆ ట్రైనర్‌ను అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు కోవై కళైమగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది. ఈ మాక్‌డ్రిల్ ట్రైనర్‌టీఆర్ ఆర్ముగం పర్యవేక్షణలో జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులను రెండో అంతస్తు నుంచి కిందికి దూకాలని ట్రైనర్ సూచించాడు. దాంతో బీబీఏ సెకండియర్ విద్యార్థిని లోకేశ్వరి దూకడానికి భయపడుతుండడంతో ట్రైనర్ ఆర్ముగం ఆమెను కిందికి తోసేయడంతో విద్యార్థిని తల మొదటి అంతస్తు గోడకు బలంగా తాకింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లోకేశ్వరి చనిపోయింది. ఈ ఘటనను అక్కడి విద్యార్థులు వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని బలవంతంగా తోసేసిన ట్రైనర్ ఆర్ముగం ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనతో కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆమెను అకారణంగా బలి తీసుకున్నారని మండిపడ్డారు.




