Tuesday, 3 November 2026

ట్విట్టర్ సీఈవో రేసులో తెలుగు మహిళ

9ko5y3jmవిజయవాడ, సెప్టెంబర్ 4 : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సారధి బాధ్యతలను తెలుగు మహిళ విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ చేపట్టబోతున్నారు. ఇప్పటి దాకా ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్‌కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత పదవి కోసం ఆ సంస్థ అనేక మంది పేర్లను పరిశీలించింది. పద్మశ్రీతో పాటు సీవీఎస్ ఇంట్రాక్టివ్ విభాగం అధినేత జిమ్‌లాన్‌జోన్ పేర్లను ఎంపిక చేసింది. వీరిద్దరిలో ఎవరికి సీఈవో పదవి లభిస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే కన్సూమర్ ఇంటర్‌నెట్ వ్యాపారంలో ఆరితేరిన పద్మశ్రీ వారియర్ వైపే ట్విట్టర్ యాజమాన్యం మొగ్గు చూపినట్లు సమాచారం. పద్మశ్రీ వారియర్ స్వస్థలం విజయవాడ. మాంటిసోరిస్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన పద్మశ్రీ స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పద్మశ్రీ గత 20 ఏళ్లుగా అమెరికాలో స్థిర పడి పలు కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించారు. గతంలో సిస్కో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *