హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): కొండాపూర్‌లో డాన్యూబ్ మ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే డాన్యూబ్ మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ మెరుగైన స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం తెలంగాణెళి అని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ విధానాల కారణంగా ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో స్థానికులకు ఉద్యోగ ఉపాధి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాలగొన్నారు.




