Friday, 6 November 2026

డిఎస్సీ పోస్టులు పెంచాలంటూ దీక్ష

తిరుపతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): డిఎస్‌సి పోస్టుల సంఖ్యను పెంచాలని.. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎస్‌జిటి పోస్టుల సంఖ్యను పెంచాలని, ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు ఎంఎ.గఫూర్‌, రమాదేవిలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ, యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులంతా పాల్గొన్నారు.