డిఐజి ఆఫీసులో ఘనంగా వేడుకలు

ఏలూరు,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): పశ్చిమ గోదావరి జిల్లాలో 72 వ స్వాతంత్య దినోత్సం సందర్భంగా బుధవారం ఏలూరు డిఐజి ఆధ్వర్యంలో ఐపిఎస్‌ రేంజ్‌ ఆఫీసులో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు రేంజ్‌ డిఐజి టి.రవి కుమార్‌ మూర్తి జండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం అందరికీ స్వీట్స్‌ను పంచారు. ఈ సందర్భంగా డిఐజి టి.రవి కుమార్‌ మూర్తి, ఐపిఎస్‌లు ప్రసంగించారు. బ్రిటీష్‌ దుష్ట పాలన నుంచి భారత దేశ ప్రజల విముక్తి కోసం పాటుపడి, స్వాతంత్య్ర ఫలాలను భావితరాలకు అందించిన అమరవీరులను స్మరించి, మహాత్ములకు ఘననివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రేంజ్‌ ఆఫీసు సిబ్బంది పాల్గన్నారు.

తాజావార్తలు