డిసెంబర్‌ నాటికి దుర్గగుడి ఫ్లై ఓవర్‌ సిద్దం: కలెక్టర్‌

విజయవాడ,మే4(జ‌నం సాక్షి ):  డిసెంబర్‌ నాటికి దుర్గగుడి ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు. అక్టోబర్‌ నాటికి బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై  ఓవర్‌ నిర్మాణం పూర్తి చేస్తామని అలాగే నెల రోజుల్లో బందరు పోర్టు పనులు ప్రారంభంకానున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. వర్షాలకు తడిచిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించామన్నారు.  మైనింగ్‌లో ప్రైవేటు వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో ఉద్యోగులకు బయోమెట్రిక్‌ 100 శాతం అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ లక్ష్మీకాంతం తెలిపారు.

తాజావార్తలు