Tuesday, 3 November 2026

డీకే అరుణ వ్యాఖ్యతో కంటతడి పెట్టిన డిప్యూటీ స్పీకర్

66అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కంటతడి పెట్టారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. అరుణ వ్యాఖ్యలతో పద్మా దేవేందర్‌రెడ్డి తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. మనస్తాపంతో కన్నీరు పెట్టుకున్నారు. సంస్కారం లేని వారు సభ నడుపుతున్నారు అనడం సంస్కారమా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలు చేసిన డీకే అరుణతో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే సస్పెండ్ చేయడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. ఏపీ శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పారు. కాంగ్రెస్ వారు తక్కువ మంది ఉన్నా.. మాట్లాడానికి సమయం ఎక్కువ ఇచ్చామని తెలిపారు. ఒక మహిళ పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. చైర్‌లో ఉన్న వారిపట్ల అలా మాట్లాడటం సరైంది కాదన్నారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. గతంలో పదం జారితే మంత్రులమే క్షమాపణ చెప్పాం.. అది మా సంస్కారమని మంత్రి గుర్తు చేశారు. క్షమాపణ చెప్పాలా వద్దా.. అనేది డీకే అరుణ విచక్షణకే వదిలేస్తున్నానని పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. దీనిపై డీకే అరుణ వివరణ ఇస్తూ డిప్యూటీ స్పీకర్ ను కించపర్చేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సమర్ధించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *