కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిన డీసీసీబీ ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నిన్న రాత్రి నుంచి కనిపించకపోవడంతో పలు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తన భర్త అదృశ్యమైనట్లు ఎన్నికల అధికారి భార్య ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు డీసీసీబీ కార్యాలయం వద్దకు కాంగ్రెస్, వైకాపా నేతలు మద్దతుదారులతో కలిసి చేరుకున్నారు.దీంతో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు చేపట్టారు.




